
జనరల్

టిబెట్‌లో ఇటీవల హిమానీనదం కూలిపోవడంతో ఈ నెల 26న భారీ వరదలు సంభవించిన ఘటన మరవకముందే మరో ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం టిబెట్‌లో భారీ భూప్రకంపనలు సంభవించాయి. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం, భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది.
భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు GFZ అధికారులు వెల్లడించారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని తెలిపారు. వరదల ఘటన తర్వాత కొద్దిరోజులకే భూకంపం సంభవించడంతో టిబెట్‌లో మరోసారి ఆందోళన నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!