
రాజకీయాలు

తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో మైలురాయిగా నిలవనున్న 50వ చిత్రం భారీ మాస్-యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరో స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ అందించిన కథ ఆధారంగా ఈ సినిమా రూపొందవచ్చని టాక్ నడుస్తోంది.
సూర్య, శంకర్, ఏఆర్ మురుగదాస్ వంటి ముగ్గురు ప్రముఖుల కలయిక నిజమైతే అభిమానులకు భారీ సినిమాటిక్ ట్రీట్‌గా మారే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. సూర్య 50వ సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!