
జనరల్

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి నిధులు సమకూర్చడంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాధాన్య కార్యక్రమాలకు మద్దతుగా రూపొందించిన 95 బిలియన్ డాలర్ల బడ్జెట్ ప్రతిపాదనకు అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో పెంటగాన్ అవసరాలు, జాతీయ భద్రత, రైతులకు ఆర్థిక సాయం, ఎన్నికల సంస్కరణలకు కూడా నిధులు కేటాయించారు.
ఈ బిల్లు 216-214 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. మధ్యంతర ఎన్నికలకు ముందు ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత కీలక ఆర్థిక ప్రతిపాదనగా దీనిని భావిస్తున్నారు. అయితే డెమోక్రాట్లతో పాటు కొందరు రిపబ్లికన్ సభ్యులు కూడా బిల్లుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో రాజకీయంగా విస్తృత చర్చకు దారి తీసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!