

ట్రైన్ ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై టికెట్ రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే అదనపు లగేజ్‌ను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సౌకర్యం కల్పించనుంది. 2026 జూలై 31 నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు పరిమితికి మించి సామాను తీసుకెళ్లాలంటే రైల్వే పార్సిల్ కార్యాలయానికి వెళ్లి ప్రత్యేకంగా బుక్ చేసుకోవాల్సి వచ్చేది.
ప్రస్తుతం ప్రయాణించే తరగతిని బట్టి ఉచిత లగేజ్ పరిమితులు ఉన్నాయి. ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 70 కిలోలు, ఫస్ట్ క్లాస్ మరియు ఏసీ 2-టైర్‌లో 50 కిలోలు, ఏసీ 3-టైర్, ఏసీ చెయిర్ కార్, స్లీపర్ క్లాస్‌లో 40 కిలోలు, సెకండ్ క్లాస్‌లో 35 కిలోల వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఈ పరిమితిని మించి సామాను తీసుకెళ్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
అనుమతించిన పరిమితికి మించి లగేజ్ తీసుకెళ్లి బుకింగ్ చేయకపోతే తనిఖీల సమయంలో జరిమానా విధించే అవకాశం ఉంటుంది. సామాను బరువుతో పాటు పరిమాణంపై కూడా రైల్వే నిబంధనలు అమలులో ఉన్నాయి. పరిమితికి మించిన పెద్ద వస్తువులను లగేజ్ లేదా పార్సిల్ వ్యాన్‌లో బుక్ చేయాల్సి ఉంటుంది. కొత్త ఆన్‌లైన్ బుకింగ్ విధానం ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనుంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!