
ఆరోగ్యం

కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కర్ణాటకకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలని ఆదేశిస్తూ, కావేరీ జలాల నిర్వహణ ప్రాధికార సంస్థ ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ప్రాధికార సంస్థ నిర్ణయాలకు అనుగుణంగా నీటి విడుదల కొనసాగించాలని కోర్టు పేర్కొంది.
కర్ణాటక 12 రోజుల పాటు రోజుకు 12 వేల ఘనపుటడుగుల చొప్పున తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నీటి విడుదల పరిస్థితిని పరిశీలించిన అనంతరం ఈ నెల 24న తదుపరి విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. అప్పటి పరిస్థితులను బట్టి మరిన్ని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!