11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పంచాయతీల సొంత ఆదాయంపై కీలక నిర్ణయం

Writer: Nithish 05:52 AM, 11 సెప్టెంబర్, 2026
పంచాయతీల సొంత ఆదాయంపై కీలక నిర్ణయం

గ్రామ పంచాయతీలకు వచ్చే సొంత ఆదాయాన్ని ఇకపై ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సిన అవసరం లేదు. ఆ నిధులను స్థానిక అవసరాలకు వినియోగించేందుకు ఖజానా అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. గ్రామసభ తీర్మానం మేరకు పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, ఇతర స్థానిక అవసరాలకు నిధులను వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌ 70(3)కు ప్రభుత్వం సవరణ చేసింది. గురువారం శాసనసభ ఈ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. చర్చ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలకు పన్నులు, సుంకాలు, ఫీజులు వసూలు చేసి స్థానికంగానే ఖర్చు చేసే అధికారం ఉందన్నారు. 2018లో నాటి ప్రభుత్వం చేసిన చట్ట సవరణతో ఈ అధికారం పరిమితమైందని, ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీలో జమ చేసేలా నిబంధనలు మార్చారని తెలిపారు.

మున్సిపాలిటీలకు నిధుల వినియోగంలో అవకాశం కల్పించి, గ్రామ పంచాయతీలపై వివక్ష చూపారని సీతక్క విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నిధులు బ్యాంకు ఖాతాల్లో జమై వినియోగిస్తున్నట్లే పంచాయతీల సొంత ఆదాయాన్ని కూడా ఇకపై బ్యాంకుల్లో జమచేసుకుని వినియోగించుకునేలా సవరణ తీసుకొచ్చినట్లు చెప్పారు. 2018కు ముందు రిజిస్ట్రేషన్ల స్టాంప్‌ డ్యూటీలో పంచాయతీలకు వచ్చే వాటాను కూడా నాటి ప్రభుత్వం తగ్గించిందని, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రతినెలా పంచాయతీలకు రూ.50 కోట్లు విడుదల చేస్తున్నామని, 2025-26లో రెండో విడతగా కేంద్రం నుంచి రూ.619 కోట్లు రావాల్సి ఉందన్నారు. మల్టీపర్పస్‌ సిబ్బంది వేతనాల పెంపు, మాజీ సర్పంచుల పెండింగ్‌ బిల్లుల అంశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. అక్టోబర్‌ తర్వాత గ్రామాల్లో పొలం బాటల నిర్మాణ పనులు చేపడతామని, ఎన్నికలు జరగని ఏజెన్సీలోని 52 పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు సమకూరుస్తామని వెల్లడించారు. బీజేపీ సభ్యుడు పాయల్‌ శంకర్‌ కుబేర్‌ సాఫ్ట్‌వేర్‌ కారణంగా బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని పేర్కొనగా, పాల్వాయి హరీశ్‌బాబు పంచాయతీలకు ఉన్న రూ.1,500 కోట్ల విద్యుత్‌ బకాయిలను రద్దు చేయాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భూ కేటాయింపులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

భూ కేటాయింపులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాం: రేవంత్‌

బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాం: రేవంత్‌

సభలో విపక్ష తీరుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

సభలో విపక్ష తీరుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

చిన్న శ్రీను జ్ఞాపకాలతో బొత్స సత్యనారాయణ కంటతడి.. ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం

చిన్న శ్రీను జ్ఞాపకాలతో బొత్స సత్యనారాయణ కంటతడి.. ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం

ప్రశ్నిస్తే అసెంబ్లీలో గొంతు నొక్కి సస్పెండ్ చేశారు: కేటీఆర్

ప్రశ్నిస్తే అసెంబ్లీలో గొంతు నొక్కి సస్పెండ్ చేశారు: కేటీఆర్

విజయ్‌ ‘దవడ సంజ్ఞ’పై స్టాలిన్‌ కౌంటర్‌..

విజయ్‌ ‘దవడ సంజ్ఞ’పై స్టాలిన్‌ కౌంటర్‌..

ట్యాగ్లు
గ్రామ పంచాయతీలుపంచాయతీరాజ్సీతక్కతెలంగాణ అసెంబ్లీపంచాయతీ నిధులుగ్రామసభస్థానిక సంస్థలుపంచాయతీ ఆదాయంతెలంగాణ ప్రభుత్వంపంచాయతీ చట్ట సవరణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన
జనరల్

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

రాగి ధరలకు రికార్డు
బిజినెస్

రాగి ధరలకు రికార్డు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఈ జోడీ మెప్పించిందా?
రివ్యూలు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఈ జోడీ మెప్పించిందా?

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌
బిజినెస్

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు
జనరల్

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..
జనరల్

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ
జనరల్

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు
జనరల్

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో అడుగు
జనరల్

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో అడుగు

హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌.. శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు
జనరల్

హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌.. శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీలో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన
జనరల్

ఆర్టీసీలో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!