11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో అడుగు

Writer: Nithish 06:12 AM, 11 సెప్టెంబర్, 2026
అంతరిక్ష రంగంలో భారత్‌ మరో అడుగు

ప్రపంచానికి సురక్షితమైన, సుస్థిరమైన, అంతర్జాతీయ న్యాయసూత్రాలకు అనుగుణంగా ఉండే అంతరిక్ష రంగం అవసరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతరిక్ష పరిశోధనల ద్వారా సేకరించే శాస్త్రీయ సమాచారాన్ని సమష్టి ప్రయోజనాలకు వినియోగించాలన్నదే భారత్‌ లక్ష్యమని తెలిపారు. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో జరుగుతున్న తొలి అంతర్జాతీయ ఖగోళ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి గురువారం ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ‘వసుధైక కుటుంబం’ స్ఫూర్తితో ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవితవ్యం అనే భావన భూమి నుంచి అంతరిక్షం వరకు విస్తరించాలన్నారు.

భారత్‌ అంతరిక్ష ప్రయాణాన్ని బలోపేతం చేయడంలో ఇస్రో కీలక పాత్ర పోషించిందని మోదీ ప్రశంసించారు. ఇస్రో సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ భాగస్వామ్యాలు ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 430 ఉపగ్రహాలను భారత రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి పంపినట్లు తెలిపారు. చంద్రయాన్‌-3తో చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి చేరిన తొలి దేశంగా భారత్‌ నిలిచిందని గుర్తుచేశారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం, 2040 నాటికి భారతీయ వ్యోమగామిని చంద్రుడిపైకి పంపే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఇదే సమయంలో జర్మనీ ఛాన్సలర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. భారత్‌-జర్మనీ దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ప్రత్యామ్నాయ ఇంధనం, ఆధునిక సాంకేతికత రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు మోదీ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు

హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌.. శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌.. శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
నరేంద్ర మోదీఇస్రోభారత అంతరిక్ష రంగంఅంతరిక్ష పరిశోధనలుచంద్రయాన్ 3స్పేస్ స్టేషన్అంతర్జాతీయ ఖగోళ సదస్సుభారత్ జర్మనీ సంబంధాలుఫ్రెడ్రిక్ మెర్జ్వ్యూహాత్మక భాగస్వామ్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన
జనరల్

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

రాగి ధరలకు రికార్డు
బిజినెస్

రాగి ధరలకు రికార్డు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఈ జోడీ మెప్పించిందా?
రివ్యూలు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఈ జోడీ మెప్పించిందా?

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌
బిజినెస్

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు
జనరల్

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..
జనరల్

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ
జనరల్

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు
జనరల్

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో అడుగు
జనరల్

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో అడుగు

హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌.. శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు
జనరల్

హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌.. శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీలో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన
జనరల్

ఆర్టీసీలో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!