

మహువా మోయిత్రా ప్రధాని నరేంద్ర మోదీ పై మరోసారి విమర్శలు గుప్పించారు. నార్వే పర్యటన సందర్భంగా నార్వేజియన్ జర్నలిస్టు హెల్లే ల్యాంగ్ స్వెండ్స్ లేవనెత్తిన ప్రశ్నలపై సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేస్తున్నారని మహువా మోయిత్రా ఆరోపించారు. ఒస్లోలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోవడాన్ని జర్నలిస్టు ప్రస్తావించగా, ఆ విషయాన్ని ప్రపంచ దృష్టికి తీసుకువచ్చినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.
జర్నలిస్టు హెల్లే ల్యాంగ్ స్వెండ్స్ షేర్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఈ వివాదం రాజకీయ రంగు దాల్చింది. ప్రపంచ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో నార్వే అగ్రస్థానంలో ఉండగా భారత్ స్థానం వెనుకబడిందని ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. ప్రతిపక్ష నేతలు జర్నలిస్టుకు మద్దతు తెలుపుతుండగా, బీజేపీ అనుచరులు భారత్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!