

బీఆర్కే భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, ఎస్ఐఆర్ అంశంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. బీజేపీ ఎంపీలు, ముఖ్యంగా కిషన్ రెడ్డి దొంగ ఓట్లతో గెలిచారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన విధంగానే తెలంగాణలో కూడా ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ అమలై సుమారు 5.90 లక్షల ఓట్లు తొలగించబడ్డాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయని, సెక్యులర్ ఓట్ల తొలగింపుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు కనీసం మూడు సార్లు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. విదేశాల్లో ఉన్న ఓటర్ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని, మైనర్ మరియు పేద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!