

సూర్య హీరోగా ఆర్‌జే బాలాజీ తెరకెక్కించిన కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) ఎన్నో అడ్డంకుల తర్వాత నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట మే 14న విడుదల కావాల్సిన షోలు రద్దు కావడంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే రాత్రికి రాత్రే సమస్యలు పరిష్కారమవడంతో మే 15న సినిమా గ్రాండ్‌గా విడుదలైంది.
చెన్నైలోని ఓ థియేటర్‌కు దర్శకుడు ఆర్‌జే బాలాజీ తో పాటు కార్తి, త్రిష హాజరై అభిమానుల్లో ఉత్సాహం నింపారు. అభిమానుల స్పందన చూసి ఆర్‌జే బాలాజీ భావోద్వేగానికి గురికాగా, త్రిష ఆయనను హగ్ చేసుకుని అభినందించారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయం షోలకు అనుమతి ఇచ్చిన తమిళనాడు సీఎం విజయ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ టైటిల్ కార్డులో “సీఎం విజయ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు” అని ప్రస్తావించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విజయ్‌ను ఆ హోదాతో ప్రస్తావించిన తొలి చిత్రంగా కరుప్పు నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!