

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని రాష్ట్రవ్యాప్తంగా పటిష్టంగా చేపట్టినట్లు తెలిపారు. సంఘటన్ సృజన్ అభియాన్లో భాగంగా తెలంగాణలో ప్రక్రియను సమగ్రంగా అమలు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 90కి పైగా నియోజకవర్గాల్లో బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏలు) నియామకం పూర్తయిందని, జిల్లా మరియు మండల కమిటీల ఏర్పాటు కూడా దాదాపు పూర్తయిందని వెల్లడించారు.
ప్రతి ఓటును పరిరక్షించడం అత్యంత కీలకమని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించబడిన ఘటనలను ప్రస్తావిస్తూ, తెలంగాణలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. శిక్షణ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. అలాగే దేశంలో బీజేపీ విషపూరిత రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!