

తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నిజామాబాద్లో మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు. అవినీతికి సంబంధించిన ఆధారాలతో కొందరు పట్టుబడ్డారని పేర్కొంటూ, బీఆర్ఎస్ పాలనలో విచ్చలవిడిగా భూదోపిడీ జరిగిందని విమర్శించారు. ఆ పార్టీ అవినీతి ఆరోపణల చిట్టా చాలా పెద్దదని వ్యాఖ్యానించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హయాంలో నీటి నిర్వహణలో అక్రమాలు జరిగాయని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందని విమర్శించారు. రాహుల్ గాంధీకి దేశ సేవే ప్రధానమని ప్రశంసించారు. తెలంగాణ నీటి వాటా విషయంలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక నిబద్ధతతో ముందుకు సాగుతున్నారని, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!