
క్రీడలు

భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో ఘనంగా జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్, మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ 25 ఏళ్ల ప్రస్థానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ జెండా అన్యాయానికి వ్యతిరేకంగా పుట్టిన పోరాట చిహ్నమని ఆయన పేర్కొన్నారు. కే. చంద్రశేఖర్ రావు 25 ఏళ్ల క్రితం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. ఉద్యమ పార్టీగా, అధికార పార్టీగా, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా అన్ని పాత్రలను సమర్థంగా పోషించిందని తెలిపారు. కేటీఆర్ మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలో మళ్లీ తెలంగాణలో అధికారాన్ని సాధించేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!