
గాసిప్స్

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, అలాగే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నందినగర్‌లో జరిగిన ఈ భేటీలో పరస్పర ప్రయోజనాలు, వ్యూహాత్మక అంశాలు, పెట్టుబడి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
తెలంగాణలో ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఇన్నోవేషన్ రంగాల్లో ఉన్న అవకాశాలపై కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. అలాగే విద్యారంగంలో భాగస్వామ్యాలు, సాంకేతిక సహకారం, యువతకు అంతర్జాతీయ అవకాశాల కల్పన వంటి అంశాలు సమావేశంలో ప్రధాన చర్చగా నిలిచాయి. భారత్–ఆస్ట్రేలియా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం సాగిందని ఇరు వర్గాలు అభిప్రాయపడ్డాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!