16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..

Writer: Chandrika 08:30 AM, 16 ఆగస్టు, 2026
ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) కీలక ముందడుగు వేసింది. నాలుగు జట్లతో మహిళా ప్రీమియర్‌ లీగ్‌ (ఎంపీఎల్‌)ను నిర్వహించనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) తెలిపారు. సెప్టెంబర్‌ 15 నుంచి 26 వరకు మంగళగిరి క్రికెట్‌ స్టేడియంలో ఈ లీగ్‌ జరగనుంది. ఏసీఏ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేశినేని చిన్ని, భారత మహిళల మాజీ కెప్టెన్‌, ఏసీఏ మహిళల జట్టు మెంటార్‌ మిథాలీ రాజ్‌, ఏసీఏ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ కళ్యాణ్‌ కృష్ణ లీగ్‌ వివరాలను వెల్లడించారు. బిడ్డింగ్‌ విధానం ద్వారా నాలుగు ఫ్రాంచైజీలను ఇప్పటికే ఖరారు చేసినట్లు కేశినేని చిన్ని తెలిపారు. లీగ్‌లో పాల్గొనే క్రీడాకారిణుల వేలం కోసం 200 మందికిపైగా పేర్లు నమోదు చేసుకున్నట్లు చెప్పారు.

ఏసీఏ మహిళా ప్రీమియర్‌ లీగ్‌ సంస్థకు కీలక మైలురాయిగా నిలుస్తుందని మిథాలీ రాజ్‌ అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఈ లీగ్‌ మంచి వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారిణులకు పోటీ క్రికెట్‌లో మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం నాలుగు జట్లతో ప్రారంభిస్తున్న ఎంపీఎల్‌ను భవిష్యత్‌లో మరిన్ని ఫ్రాంచైజీలకు విస్తరిస్తామని కళ్యాణ్‌ కృష్ణ తెలిపారు. కొత్త లీగ్‌ ద్వారా రాష్ట్రంలో మహిళా క్రికెట్‌కు బలమైన వ్యవస్థ ఏర్పడటంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారిణులకు ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు లభిస్తాయని ఏసీఏ భావిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ షురూ...

ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ షురూ...

గాలెలో టీమ్‌ఇండియా జోరు..

గాలెలో టీమ్‌ఇండియా జోరు..

హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం

హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పడిక్కల్ అరుదైన రికార్డు

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పడిక్కల్ అరుదైన రికార్డు

తొలి టెస్టుకు వరుణుడి దెబ్బ...

తొలి టెస్టుకు వరుణుడి దెబ్బ...

ట్యాగ్లు
ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌మహిళా ప్రీమియర్‌ లీగ్‌ఏపీ క్రికెట్‌మహిళా క్రికెట్‌మిథాలీ రాజ్‌కేశినేని శివనాథ్‌మంగళగిరి క్రికెట్‌ స్టేడియంగ్రామీణ క్రికెట్‌ ప్రతిభఏసీఏమహిళా క్రికెటర్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు

జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్
జనరల్

పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్

టీఎంసీ  సీనియర్ నేత  ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...
జనరల్

టీఎంసీ సీనియర్ నేత ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...
జనరల్

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..
రాజకీయాలు

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..

ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ షురూ...
క్రీడలు

ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ షురూ...

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌
జనరల్

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..
జనరల్

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..

బ్లాక్‌ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలా?... పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..
ఆరోగ్యం

బ్లాక్‌ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలా?... పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..
జనరల్

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..
జనరల్

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..
క్రీడలు

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..

తిరుమలకు పోటెత్తిన భక్తులు..
జనరల్

తిరుమలకు పోటెత్తిన భక్తులు..