
జనరల్

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదం కాంగ్రెస్ పార్టీలో మరో కీలక దశకు చేరుకుంది. ఎంపీ మల్లు రవి నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు, ఫిర్యాదులను పరిశీలించింది. సంబంధిత నేతలు సమర్పించిన వివరణలను కూడా కమిటీ పరిశీలించినట్లు సమాచారం. ఈ అంశంపై సమగ్ర నివేదికను ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ నాయకత్వానికి అందించనున్నట్లు తెలుస్తోంది.
ఇక క్రమశిక్షణా కమిటీ ఈరోజు మరోసారి సమావేశమై తదుపరి చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు తేలితే చర్యలకు సిఫార్సు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, వాటికి తనను బాధ్యురాలిని చేయడం సరికాదని కొండా సురేఖ ఇప్పటికే కమిటీకి వివరణ ఇచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!