
సినిమాలు

ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నీటి పథకాల కోసం రూ.9,514 కోట్ల వ్యయంతో 506 కొత్త ప్రాజెక్టులను ఆమోదించారు. విరూపాక్ష ఆర్గానిక్స్‌కు 100 ఎకరాల భూమిని కేటాయించారు. అదేవిధంగా అమరావతిలో ఐదు కంపెనీల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రిలయన్స్ కన్జ్యూమర్ యూనిట్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేశారు.
అమరావతిలో గవర్నర్ బంగ్లా, దర్బార్ హాల్ మరియు గెస్ట్‌హౌస్‌ల నిర్మాణానికి సంబంధించిన బిడ్లకు అనుమతులు ఇచ్చారు. వైజాగ్–చెన్నై కారిడార్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కుప్పంలో పాలర్ నదిపై నాలుగు చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి అవసరమైన అనుమతులకు కూడా మంత్రి పార్థసారథి సమితి నుంచి ఆమోదం లభించింది. అలాగే 417 భాషా పండిట్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు మంజూరు చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!