

నీట్ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీ ఆరోపణలపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అర్ధరాత్రి విడుదల చేసిన ఆ వీడియో దయనీయంగా ఉందని, విద్యార్థులను అవమానించేలా ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.
శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ, విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని, నిరసనల్లో విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కఠిన చర్యలపై కేబినెట్‌లో చర్చిస్తామని ప్రధాని ప్రకటించిన కొద్దిసేపటికే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. నీట్-యూజీ వివాదంపై విద్యార్థులు, యువత ఆందోళనలు కొనసాగుతుండగా, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!