

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన విషయంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నుంచి నోటీసు అందిందని కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ నెల 16న ఢిల్లీ హైకోర్టులో విచారణకు సంబంధించిన పిటిషన్‌పై సమాచారం ఇవ్వడానికి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నోటీసు అందిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై తన లీగల్ టీమ్‌తో సంప్రదింపులు జరుపుతున్నానని, చట్టపరమైన ప్రక్రియలో భాగంగా ఉన్న ఈ నోటీసును ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆమె అన్నారు.
ఇంతకుముందు ఈ కేసులో చార్జీలు ఫ్రేమ్ చేయడాన్ని కూడా రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరిస్తూ కేసును కొట్టివేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఆ సమయంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌పై విచారణ జరపాలని కూడా కోర్టు వ్యాఖ్యానించిందని తెలిపారు. ఆ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. సత్యం తనతో ఉందని విశ్వాసం వ్యక్తం చేసిన కవిత, చట్టపరమైన వ్యవస్థకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు.


















.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!