
ఆరోగ్యం

రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కృష్ణా జలాల అంశంపై బీఆర్ఎస్ మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేశారు. తమ పాలనలో కర్ణాటకలో ఆనకట్టలు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలు గూడూరు ప్రాంతంలో చేసిన విమర్శలను మంత్రి ఖండించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం జూరాల ప్రాజెక్టు పరిధిలోని రైతులను నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. కృష్ణా, భీమా నదుల నీటిని నిల్వ చేసి సాగు, తాగునీటి అవసరాలు తీర్చాలనే ఆలోచన కూడా లేకపోయిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ కర్ణాటకతో సమన్వయం చేస్తూ బ్యారేజీ-కమ్-బ్రిడ్జ్ ప్రాజెక్టులకు సమగ్ర ప్రణాళిక నివేదికలు సిద్ధం చేసిందని తెలిపారు. ముంపు గ్రామాల అభివృద్ధి, పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!