
జనరల్

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్పై తమ సమాధానాన్ని దాఖలు చేసేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు మూడు వారాల గడువు మంజూరు చేసింది.
జస్టిస్ మనోజ్ జైన్ ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 10కు వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంలో దాఖలైన ఈ పిటిషన్పై కోర్టు నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కేసు తదుపరి విచారణలో ఇరుపక్షాల వాదనలు కీలకం కానున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!