

టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు నేరెళ్ల ఇసుక ఘటన బాధితులను పరామర్శించనున్నారు. 2017 జులై 2న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఇసుక లారీ ఢీకొని నేరెళ్ల రైతు బదనపు భూమయ్య మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పలు ఇసుక లారీలను దగ్ధం చేసిన ఘటనలో పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. అప్పట్లో పోలీసుల వేధింపులు, థర్డ్ డిగ్రీ ప్రయోగంపై బాధితులు ఆరోపణలు చేశారు.
రిమాండ్‌లో ఉన్న వారిలో కొందరికి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇటీవల బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ మృతి చెందగా, మరో బాధితుడు పెంట బాణయ్య కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. నేరెళ్ల ఘటనపై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు చేయగా, అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బాధితులు కోరుతున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!