

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ విధానాలను కేటీఆర్ బహిరంగంగా తప్పుబడుతున్నారని పేర్కొంటూ, అది పార్టీ వ్యతిరేక చర్య కాదా అని ప్రశ్నించారు. తనను ఒక నేతను విమర్శించినందుకే బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారని, అదే సమయంలో పార్టీ అధినేతపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. కేటీఆర్ వైఫల్యాలను, చేతకానితనాన్ని కేసీఆర్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కవిత ఆరోపించారు.
బీఆర్‌ఎస్ పాలనలో ఫామ్‌హౌస్‌లు, అనుమతులు, ఆంధ్రా మిత్రులకు ప్రయోజనాలు, క్విడ్ ప్రోకో వ్యవహారాలపై కూడా కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల బీఆర్‌ఎస్ సమావేశంలో ఓ రైతు, ఓ మహిళ పట్ల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేటీఆర్ తీరును ఆమె ప్రశ్నించారు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఆశ్రయించారంటూ విమర్శలు చేసిన కవిత, తాను ఎవరి మాటలు విని మాట్లాడనని, నిర్దిష్ట ఆధారాలతోనే మాట్లాడతానని పేర్కొన్నారు. చివరగా “నాతో పెట్టుకోకు” అంటూ కేటీఆర్‌ను హెచ్చరించారు. ఇవన్నీ కవిత చేసిన రాజకీయ ఆరోపణలు, వ్యాఖ్యలేనని గమనించాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!