

ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్ జిల్లా జౌల్జీబీ జాతరలో శనివారం రాజకీయ వివాదం చోటుచేసుకుంది. వేదికపై ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వలేదన్న ఆగ్రహంతో ధార్చుల కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ సింగ్ ధామి మైక్‌ను విసిరికొట్టారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జాతరకు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొంతసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్ సింగ్ ధామి తన మద్దతుదారులతో కలిసి వేదికపైకి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. జాతర అధ్యక్షుడిగా ఉన్న తనకు ముఖ్యమంత్రి సమక్షంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు మైక్‌ను నిలిపివేశారని పేర్కొన్నారు.
ఈ పరిణామంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే మైక్‌ను విసిరికొట్టడంతో పాటు వేదికపై ఉన్న పోడియం, కుర్చీలను పడేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిపై కూడా ఆయన విమర్శలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయంగా చర్చ మొదలైంది. ఎమ్మెల్యే ప్రవర్తనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాజకీయాల్లో మరో వివాదానికి దారితీసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!