
బిజినెస్

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో విధి నిర్వహణలో ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (SPO) రష్‌పాల్ సింగ్, బాబీ చంద్‌ల మృతదేహాలను డంపర్ ట్రక్కులో తరలించారన్న ఆరోపణలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మృతదేహాలను సరైన గౌరవం, మర్యాద లేకుండా తరలించారని బీజేపీ ఎమ్మెల్యే షాగున్ పరిహార్ ఆరోపించారు.
అధికారుల నిర్లక్ష్యంపై షాగున్ పరిహార్ కన్నీటిపర్యంతమవుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన సిబ్బందికి ఇలాంటి అవమానం జరగడం బాధాకరమని పేర్కొన్నారు. ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!