
గాసిప్స్

పార్టీ నమోదు అంశంలో కల్వకుంట్ల కవితకు దిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది.ఆమె ప్రారంభించాలనుకుంటున్న ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పార్టీ నమోదు పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు భారత ఎన్నికల సంఘానికి సూచించింది.
ఇంతకుముందు కవిత సమర్పించిన దరఖాస్తులో కొన్ని లోపాలు ఉన్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే ఆ లోపాలను సరిచేసి మళ్లీ దరఖాస్తు సమర్పించినట్లు కవిత తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
సాంకేతికంగా ఉన్న అన్ని తప్పులను సరిచేసిన తర్వాత దరఖాస్తును తిరిగి సమర్పించామని వారు వివరించారు. ఈ నేపథ్యంలో, అంశాన్ని త్వరితగతిన పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది.









.jpeg&w=3840&q=75)



.jpg&w=3840&q=75)






.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!