
న్యూస్

జీవో 317ను వెంటనే రద్దు చేసి ఉద్యోగులకు సొంత జిల్లాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె బహిరంగ లేఖ రాశారు. 2021లో జారీ చేసిన ఈ జీవో వల్ల వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. వన్‌టైం రిలీఫ్ కింద బాధితులను స్వస్థలాలకు బదిలీ చేయాలని కోరారు.
అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో జీవో 317పై సమీక్ష చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందని కవిత గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న మంత్రులు కూడా గతంలో ఇదే విషయంపై హామీలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ జీవో కారణంగా ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొంటూ, స్థానికత నిబంధనల్లో మార్పులు చేసి సొంత జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇవ్వాలని కవిత విజ్ఞప్తి చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!