

స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ నెస్లే హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. నెస్లే బిజినెస్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్బీఎస్ఐపీఎల్), టెక్నాలజీ అండ్ ప్రాసెస్ సొల్యూషన్స్ సంస్థ జెన్పాక్ట్ భాగస్వామ్యంతో ఈ జీసీసీని ఏర్పాటు చేయనుంది.
ఈ జీసీసీ కోసం ప్రాసెస్ ఇంటెలిజెన్స్, డేటా, ఏఐ, ఆటోమేషన్ రంగాల్లో జెన్పాక్ట్ తన నైపుణ్యాన్ని అందించనుంది. దీంతో నెస్లే తన వ్యాపార సేవలను మరింత ప్రామాణీకరించి, సులభతరం చేసి, విస్తరించే అవకాశం ఉంటుందని సంస్థ వెల్లడించింది.
అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పెట్టుబడి మొత్తం, పనులు పూర్తయ్యే గడువు వంటి వివరాలను నెస్లే వెల్లడించలేదు. అందుబాటులో ఉన్న అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఎకోసిస్టమ్ కారణంగా హైదరాబాద్‌ను ఎంపిక చేసినట్లు సంస్థ తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!