

భద్రత, బాధ్యతాయుత కంటెంట్ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఐటీ రూల్స్ 2021 ప్రకారం ‘సత్లుజ్’ సినిమాను ఓటీటీ వేదికల నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం తర్వాత ఈ అంశం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది.
పంజాబ్‌లోని పలు రాజకీయ పార్టీలు, శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) సినిమాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశాయి. మరోవైపు నటుడు, గాయకుడు దిల్జిత్ దొసాంజ్ కూడా చట్టబద్ధంగా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఈ సినిమాను చూడాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.
పంజాబ్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి గతంలో సీబీఎఫ్‌సీ 127 కట్స్ సూచించడంతో పాటు ‘పంజాబ్ 95’ అనే అసలు టైటిల్‌ను మార్చాలని సూచించింది. దీంతో సినిమా అసలు కథ దెబ్బతింటుందని మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. అనంతరం జూలై 3న ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!