
సినిమాలు

విజయవాడలోని కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుపై మరో కేసు నమోదైంది. తనను సీఐ నాగరాజు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో రికార్డు చేసిన అనంతరం ఆత్మహత్యకు పాల్పడిన పోగు క్రాంతికుమార్ కేసులో నాగరాజును పోలీసులు నిందితుడిగా చేర్చారు.
క్రాంతికుమార్ మరణం తర్వాత సెల్ఫీ వీడియో వెలుగులోకి రావడంతో విచారణ చేపట్టిన పోలీసులు, గతంలో నమోదు చేసిన అనుమానాస్పద మృతి కేసును మార్చారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, అలాగే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం (అట్రాసిటీ) కింద సెక్షన్లు జోడించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!