
న్యూస్

ఖమ్మంలో నిర్వహిస్తున్న దీక్ష శిబిరంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. నగర పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో సుమారు ఆరు వందల మంది పోలీసులు శిబిరాన్ని చుట్టుముట్టారు. ఉదయం ఆరు గంటల సమయంలో కవితతో పాటు విశారదన్ మరియు ఇతర నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ అనంతరం కవితను ఖమ్మం నుంచి హైదరాబాద్కు పోలీసులు తరలిస్తున్నారు. అక్కడ తెలంగాణ జాగృతి కార్యాలయానికి చేరుకున్న తర్వాత వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఆమె నిరవధిక నిరాహార దీక్షను కొనసాగించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ నిరసన కొనసాగుతుందని వెల్లడించారు.




.jpg&w=3840&q=75)



.jpg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!