
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల బాధితులకు సంఘీభావం తెలిపారు. అనంతరం బాధితులతో కలిసి జెడ్పీ సెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ కూడా పాల్గొని నిర్వాసితుల సమస్యలపై మద్దతు తెలిపారు.
అనుమతి లేకుండా ఆందోళన నిర్వహించడంతో పోలీసులు కవిత సహా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. అదే రోజు రాత్రి సుమారు 9 గంటలకు ఖమ్మం అంబేద్కర్ భవన్‌కు చేరుకున్న కవిత, వెలుగుమట్ల నిర్వాసితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!