

ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. మార్కెట్ విలువలో ఎన్విడియాను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా అవతరించింది. అమెరికా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో యాపిల్ షేరు ధర గరిష్ఠంగా 342.89 డాలర్లకు చేరడంతో కంపెనీ మార్కెట్ విలువ తొలిసారిగా 5 ట్రిలియన్ డాలర్ల మార్కును తాకింది.
ట్రేడింగ్ ముగిసే సమయానికి షేరు ధర స్వల్పంగా తగ్గడంతో మార్కెట్ విలువ మళ్లీ 5 ట్రిలియన్ డాలర్ల కంటే దిగువకు వచ్చినప్పటికీ, ఈ ఘనత యాపిల్‌కు చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. 2026లో ఇప్పటివరకు యాపిల్ షేరు సుమారు 25 శాతం పెరగడానికి స్థిరమైన లాభాలు, ఖర్చుల నియంత్రణ, సమతుల్య వ్యాపార వ్యూహం ప్రధాన కారణాలుగా నిలిచాయి.
త్వరలో యాపిల్ తన తాజా త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు, ఏఐ జీపీయూలకు భారీ డిమాండ్‌తో ఏడాది పాటు అగ్రస్థానంలో నిలిచిన ఎన్విడియా షేర్లు, ఏఐ పెట్టుబడులపై ఆందోళనల నేపథ్యంలో తాజాగా 5 శాతం వరకు పడిపోయాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!