

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఈరోజు (మంగళవారం) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 6:30 గంటలకు మాక్‌పోలింగ్ నిర్వహించారు. ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతటా సెక్షన్ 144 అమల్లో ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఎన్నికల పరిస్థితిని డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అదనంగా, మొత్తం 3,000 మంది పోలింగ్ సిబ్బంది మరియు 2,000 మంది పోలీసు సిబ్బందిను నియమించారు.
ఈ ఉప ఎన్నికలో దాదాపు నాలుగు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటివరకు 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఎన్నికల అధికారులు ఓటర్లను శాంతియుతంగా ఓటు వేయాలని కోరుతూ, ఎన్నికల నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (1)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు శాంతియుత, సమగ్ర ఏర్పాట్లు!