
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. జపాన్‌కు చెందిన ప్రముఖ, అత్యంత పురాతన వార్తాపత్రిక అసాహి షింబున్ విజయ్ రాజకీయ ప్రస్థానం, ప్రమాణ స్వీకారంపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దాదాపు 7.7 కోట్ల జనాభా కలిగిన తమిళనాడుకు ప్రముఖ భారతీయ నటుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషమని ఆ కథనంలో ప్రస్తావించింది.
కేవలం రెండేళ్ల క్రితం టీవీకే పార్టీని స్థాపించిన విజయ్, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రవిడ రాజకీయాలకు ముగింపు పలుకుతూ విజయ్ సాధించిన విజయం ప్రస్తుతం గ్లోబల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిందని జపాన్ మీడియా విశ్లేషించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!