

రానున్న పురపాలక, నగరపాలక, నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వార్డులు, డివిజన్ల పునర్విభజనపై జనసేన పార్టీ ప్రత్యేక కమిటీ గురువారం విజయవాడలో సమావేశమైంది. జనసేన పార్టీ పి.ఏ.సీ చైర్మన్ మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ ఉమ్మడి జిల్లాలకు చెందిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు, ప్రకాశం-నెల్లూరు-రాయలసీమ ప్రాంతాల్లో కమిటీలు పర్యటించి స్థానిక రాజకీయ పరిస్థితులు, పెరగనున్న వార్డులు, డివిజన్లపై అధ్యయనం చేశాయి. పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులతో సమావేశమై నివేదికలను సిద్ధం చేసి నాదెండ్ల మనోహర్‌కు అందించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి స్ఫూర్తిని కొనసాగించే విధానాలు, క్షేత్రస్థాయి కార్యక్రమాలపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ నివేదికలను పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సమర్పించనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!