

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీ తెలంగాణలో తన రాజకీయ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన జనసేన, ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
పార్టీ భావజాలానికి ఆకర్షితులై చేరాలనుకునే రాజకీయ నాయకులు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థ వర్గాల నుంచి వచ్చే అభ్యర్థనలను సమన్వయం చేసేందుకు ఏడుగురు సభ్యులతో ప్రత్యేక తెలంగాణ చేరికల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, డాక్టర్ గడల శ్రీనివాస్, గొట్టిముక్కల నరేష్ రెడ్డి, అబ్దుల్ హనీఫ్, అల్లాడి తనీష్, చిరాగ్ ప్రజీత్ గౌడ్, మేధూరి సరస్వతి సభ్యులుగా నియమితులయ్యారు.
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే చేరికల దరఖాస్తులను కమిటీ పరిశీలించిన అనంతరం వాటిని పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరికి అందజేస్తుంది. ఆయన వాటిని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారు. ఆయన సూచనల మేరకు భారీ స్థాయిలో చేరికల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కమిటీ ఏర్పాటు ద్వారా తెలంగాణలో జనసేన రాజకీయంగా వేగం పెంచినట్లు స్పష్టమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!