
రాజకీయాలు

కడప జిల్లాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆయనతో పాటు జమ్మలమడుగు, ముద్దనూరు, ఎర్రగుంట్ల జడ్పీటీసీ సభ్యులు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి తన అనుచరులతో కలిసి హుటాహుటిన విజయవాడకు వెళ్లినట్లు తెలుస్తోంది.
తన సోదరుడి కుమారుడు రాజేష్ రెడ్డికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కుతుందని ఆదినారాయణరెడ్డి ఆశించినట్లు సమాచారం. అయితే ఆ పదవి విషయంలో ఆశించిన ఫలితం రాకపోవడంతో ఆయన అసంతృప్తికి గురైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాజీనామా నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం మొదలైంది. అయితే రాజీనామాపై ఆదినారాయణరెడ్డి నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!