

అక్రమాస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సీబీఐ కోర్టు తలుపు తట్టారు. న్యాయస్థానానికి సమర్పించిన తాజా మెమోలో, ఆయన వ్యక్తిగత హాజరును మినహాయించాలని కోరారు. గతంలో సీబీఐ కోర్టు, యూరప్ పర్యటన అనంతరం ఈ నెల 14లోపు వ్యక్తిగతంగా హాజరు కావాలని జగన్కు ఆదేశాలు జారీ చేసింది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో, జగన్ న్యాయవాదుల ద్వారా కోర్టులో మెమో దాఖలు చేశారు. తాను కోర్టుకు హాజరయ్యే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు చేయాల్సి రావడం వలన పరిపాలనకు భారమవుతోందని పిటిషన్లో ప్రస్తావించారు. అందువల్ల వ్యక్తిగత హాజరును మినహాయించాలని అభ్యర్థించారు.
అయితే, కోర్టు తప్పనిసరిగా హాజరుకావాలని భావిస్తే తాను వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు సిద్ధమని, లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని జగన్ స్పష్టం చేశారు.
ఈ కేసులో కోర్టు తదుపరి విచారణ త్వరలో జరగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!