

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరులోని యలహంకలో ఉన్న తన విలాసవంతమైన నివాసంలోనే గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా కార్యక్రమాలు, పార్టీ సమావేశాలకు ఆయన రావడం చాలా అరుదు, వచ్చినా కూడా త్వరగా ముగించుకొని తిరిగి వెళ్ళిపోతున్నారు.
తాజా సమాచారం ప్రకారం, జగన్ తన విదేశీ పర్యటనకు అనుమతి కోరగా, నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. అయితే ఈ అనుమతికి షరతులు కూడా విధించబడ్డాయి.కోర్టు స్పష్టంగా చెప్పిన ప్రకారం, అక్టోబర్ 1 నుంచి 30 మధ్య 15 రోజులపాటు యూరప్ వెళ్ళవచ్చు. అయితే నవంబర్ 14 లోపు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలి అనే నిబంధనను కూడా పెట్టింది.అక్టోబర్‌లో కుటుంబ సమేతంగా యూరప్ టూర్‌కి వెళ్ళే ఆలోచనలో జగన్ ఉన్నారని సమాచారం. గత సంవత్సరం జూలైలో కూడా ఆయన యూరప్ వెకేషన్‌కి వెళ్ళారు. ఇది రెండోసారి అవుతుంది.
ఇకపోతే, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నారనే విమర్శలు జగన్‌పై ఇప్పటికే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో యూరప్ ట్రిప్‌కి ప్రాధాన్యం ఇవ్వడం ఆయనపై మరింత విమర్శలకు దారి తీస్తోంది. ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలను పక్కన పెట్టి విశ్రాంతికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!