

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించనుంది. ‘ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్’ పేరుతో ప్రత్యేక అవార్డును ఆయనకు అందించనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.
అమెరికా పర్యటనలో భాగంగా నెతన్యాహు, ఫ్లోరిడాలోని Mar-a-Lago రిసార్టులో ట్రంప్‌తో సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గాజా శాంతి ప్రణాళిక రెండో దశ, హమాస్ నిరాయుధీకరణ సహా పలు కీలక అంతర్జాతీయ అంశాల పై ఇద్దరు నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం.
సమావేశం అనంతరం మాట్లాడుతూ, ఇజ్రాయెల్ మరియు యూదుల భద్రత, ప్రయోజనాల కోసం ట్రంప్ చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం అందించాలని నిర్ణయించామని నెతన్యాహు తెలిపారు. ఇందుకోసం శాంతి విభాగంలో తొలిసారిగా ‘ఇజ్రాయెల్ ప్రైజ్’ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటివరకు ఏ విదేశీ నేతకూ ఇజ్రాయెల్ ఈ స్థాయి పౌర పురస్కారం ఇవ్వకపోవడం విశేషంగా భావిస్తున్నారు. ద్వైపాక్షిక సమావేశం అనంతరం ట్రంప్, నెతన్యాహు కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ స్పందిస్తూ, ఇజ్రాయెల్ నుంచి ఇలాంటి గౌరవం లభించడం తనకు ఊహించని గౌరవమని వ్యాఖ్యానించారు.



.jpg&w=3840&q=75)














.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!