
క్రీడలు

ఇజ్రాయెల్ దాడిలో తమ దేశానికి చెందిన నలుగురు దౌత్యవేత్తలు మరణించారని ఇరాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ శాశ్వత ప్రతినిధి అమీర్ సయీద్ ఇరవాని ఈ విషయాన్ని వెల్లడించారు. బీరూట్‌లోని రమదా హోటల్లో ఉన్న సమయంలో ఇజ్రాయెల్ దాడి జరగడంతో ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌కు ఇరాన్ అధికారికంగా లేఖ రాసినట్లు వెల్లడించారు.
ఈ దాడి కావాలనే తమ దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని జరిపిన చర్య అని ఇరవాని ఆరోపించారు. ఈ ఘటన అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై అంతర్జాతీయ సమాజం స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని ఇరాన్ కోరింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!