

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలని లేదా పూర్తిగా లొంగిపోవాలని హెచ్చరించారు. ఇరాన్ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. ఇరాన్ నాయకులు ఒకవైపు చర్చలకు సిద్ధమని చెబుతూ, మరోవైపు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. హర్మూజ్ జలసంధి అమెరికా నియంత్రణలో ఉందని, ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను కలిగి ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు.
గల్ఫ్ దేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ విజ్ఞప్తి మేరకు దాడుల నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్‌తో దౌత్యానికి మరింత అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని, ఒప్పందం కుదరకపోతే మళ్లీ సైనిక చర్యలకు దిగుతామని హెచ్చరించారు. అయితే అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒమన్‌తో మాత్రమే హర్మూజ్ జలసంధిలో తాత్కాలిక సురక్షిత నౌకాయాన మార్గంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!