

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. వరుసగా నాలుగు రోజుల లాభాల తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పాటు బుధవారం వెలువడనున్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన ప్రకటనకు ముందు అప్రమత్తంగా వ్యవహరించారు. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, రియాల్టీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు క్షీణించాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 210.08 పాయింట్లు కోల్పోయి 78,428.95 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 159.40 పాయింట్లు పడిపోయి 24,614.90 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండిగో, టెక్ మహీంద్రా షేర్లు ప్రధానంగా నష్టపోగా, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, బీఈఎల్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 85.58 డాలర్లు, బంగారం ఔన్స్ ధర 4,047.14 డాలర్లు వద్ద ట్రేడవుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!