
సినిమాలు

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అర్థరాత్రి కురిసిన భారీ వర్షాల అనంతరం అరుదైన పసుపు రంగు కప్పలు ప్రత్యక్షమవడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కనిపించని ఈ కప్పలను చూసిన ప్రజలు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ దృశ్యాలు వేగంగా వైరల్ అయ్యాయి.
వన్యప్రాణి నిపుణుల ప్రకారం, కొన్ని కప్పల జాతులు సంతానోత్పత్తి కాలంలో, ముఖ్యంగా వర్షాకాలంలో తాత్కాలికంగా పసుపు రంగులోకి మారుతాయి. ఇది సహజ ప్రక్రియలో భాగమేనని వారు చెబుతున్నారు. ఈ అరుదైన దృశ్యం ప్రకృతి ప్రేమికులు, నెటిజన్లలో ఆసక్తిని పెంచుతూ చర్చనీయాంశంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!