
సినిమాలు

వాతావరణ పరిస్థితుల ప్రకారం తెలంగాణలో ఆగస్టు నెలలోనూ నైరుతి రుతుపవనాలు సాధారణ స్థాయిలో కొనసాగనున్నాయి. జూలై రెండోార్థంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మంచి వర్షాలు కురవగా, అదే ధోరణి ఆగస్టులో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల రూపంలో కొనసాగనున్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్వల్పంగా బలపడుతున్న పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తోందని, మాడెన్-జూలియన్ ఆసిలేషన్ (MJO) కూడా తటస్థ దశలో ఉండటంతో రుతుపవనాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది వర్షాలు సాధారణ స్థాయిలోనే ఉండే అవకాశం ఉందని, 2025లో నమోదైన భారీ వర్షాల మాదిరి పరిస్థితులు కనిపించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సూచిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!