

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ 'చిరంజీవి' చిత్రానికి సంబంధించిన అధికారిక స్నీక్ పీక్‌ను మేకర్స్ విడుదల చేశారు. శుభా సాయి వెంకట్ దర్శకత్వంలో, కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 28న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
స్నీక్ పీక్‌లో డెక్స్ట్రోకార్డియా అనే అరుదైన వైద్య పరిస్థితితో జీవించే యువకుడిగా హీరోను పరిచయం చేశారు. గుండె కుడివైపున ఉండటం వల్ల ఏర్పడే ఆసక్తికర పరిస్థితులను, హీరో-హీరోయిన్ మధ్య భావోద్వేగ సన్నివేశాలను చూపిస్తూ కథపై ఉత్కంఠ పెంచారు. చివర్లో హీరోను గ్రే షేడ్‌లో చూపించడం ద్వారా సస్పెన్స్‌ను మరింత పెంచుతూ, థ్రిల్లింగ్ అనుభూతిని అందించే చిత్రంగా 'చిరంజీవి'ని మేకర్స్ ఆవిష్కరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!