

మమతా బెనర్జీ నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి అనంతరం తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై పలువురు నేతలు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో రిజు దత్తా, కోహినూర్ మజుందార్, కార్తీక్ ఘోష్‌లను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేయడం పార్టీలో మరింత ఉద్రిక్తతకు దారితీసింది.
మాజీ టీఎంసీ ప్రతినిధి రిజు దత్తా, గతంలో బీజేపీ నేత సువేందు అధికారి పై తాను చేసిన విమర్శలు పార్టీ ఒత్తిడి వల్లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా సువేందుకు క్షమాపణలు కూడా చెప్పారు. మాజీ క్రికెటర్, మాజీ మంత్రి మనోజ్ తివారీ అసెంబ్లీ టికెట్ల కోసం అభ్యర్థుల నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించారు. పార్టీ సీనియర్ నేతలకు గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ మరికొందరు నేతలు కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!