
సినిమాలు

అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ కు మరోసారి భంగపాటు తప్పలేదు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌పై ఆరోపణలు చేయడానికి ప్రయత్నించిన పాక్‌ను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. సాయుధ ఘర్షణల్లో పౌరుల రక్షణపై జరిగిన చర్చలో పాక్ ప్రతినిధి జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా, భారత్ దీనికి తీవ్రంగా స్పందించింది.
ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పాక్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నరమేధ చర్యలకు పాల్పడే దేశం భారత అంతర్గత విషయాలపై మాట్లాడటం విచిత్రమని విమర్శించారు. ఈ ఏడాది ప్రారంభంలో అఫ్గానిస్థాన్‌లో పాక్ చేసిన దాడులను ప్రస్తావిస్తూ, రంజాన్ మాసంలో కాబుల్‌లో ఆస్పత్రిపై జరిగిన దాడిలో 269 మంది మరణించగా, 122 మంది గాయపడిన విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి చర్యలు పాక్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!