

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ‘దిష్టి’ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వేడి పెంచాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి స్పందించారు. పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తే సహించబోమని కోమటిరెడ్డి మండిపడ్డారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా మాట్లాడుతూ, పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే ఒక్క సినిమా కూడా తెలంగాణలో ఆడనివ్వమని హెచ్చరించారు. సారీ చెబితే ఒకటి–రెండు సినిమాలకు అవకాశం ఉంటుందని కూడా వ్యాఖ్యానించారు.
అదే సమయంలో మంత్రి వాకిటి శ్రీహరి విభిన్న ప్రాంతాల మధ్య విద్వేషాలు రేకెత్తించే వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి మాటకు బాధ్యత ఉండాలని, ప్రజల మధ్య చిచ్చు పెంచే వ్యాఖ్యలు నివారించాలి అని ఆయన స్పష్టం చేశారు.




















కామెంట్స్ (1)
పవన్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి